ఆండ్రాయిడ్ అంటే మొబైల్ పరికరముల కోసం తయారు చేయబడిన నిర్వాహక సంస్థ. ఇది లినక్స్ నివ్య ఆధారంగా తయారుచేయబడింది. దీనికి ఉపకరణాలను తయారుచేసేందుకు జావా ప్రోగ్రామింగ్ భాషతో API ని రూపొందించారు. ఈ APIని ఉపయోగించి చేసిన ఉపకరణాలను డెవలపర్లు తమ స్థానిక యంత్రాలలో పరీక్షించడానికి emulator అనే సాఫ్ట్‌వేర్ ఉపకరణాన్ని అందించారు. దీని సాయంతో డెవలపర్లు తాము చేసిన ఉపకరణాలను పరీక్షించడానికి మాటిమాటికి ఆండ్రాయిడ్ ఫోను జోలికి వెళ్ళకుండా ఈ emulator లో పరీక్షించుకోవచ్చు.
సాధారణంగా జావాలో చేసిన ఉపకరణాలు JVM (Java Virtual Machine) అనే యంత్రం ద్వారా నడపబడతాయి. కానీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో జావా ప్రోగ్రాంల పనితీరు మెరుగుపరచడానికి వీరు తమ స్వంతంగా JVM ని పోలి ఉండే DVM (Dalvik Virtual Machine) ని రూపొందించారు. గూగుల్‌చే నడపబడుతున్న Open Handset Alliance ఆండ్రాయిడ్‌ను రూపొందించింది.
ఆండ్రాయిడ్‌లో 2D, 3D గ్రాఫిక్స్‌ని చూపించడానికి OpenGL లైబ్రరీని ఉపయోగిస్తున్నారు. డేటాను నిక్షిప్తం చెయ్యడానికి SQLite డేటాబేస్ను ఉపయోగిస్తున్నారు
ఆండ్రాయిడ్‌లో అంతర్గతంగా ఉండే ఉపకరణాలు:
Activity
Views
Services
Content Provider
Intents
Broadcast Receiver
{syntaxhighlighter}print "Hello world";
